రూ'పోయె'... చరిత్రలో తొలిసారిగా రూ. 70.08కు డాలర్ విలువ!

  • మరింతగా పతనమైన రూపాయి
  • ఆల్ టైమ్ కనిష్ఠానికి మారకపు విలువ
  • మరింత పతనం ముందుందంటున్న నిపుణులు
డాలర్ తో రూపాయి మారకపు విలువ ఆల్ టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. చరిత్రలో తొలిసారిగా ఒక డాలర్ మారకపు విలువ రూ. 70.08ను తాకింది. టర్కీలో ఆర్థిక సంక్షోభంతో డాలర్ కు డిమాండ్ పెరుగగా, ఆ ప్రభావం రూపాయిపై పడిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. క్రితం ముగింపుతో పోలిస్తే, ఈ ఉదయం ఫారెక్స్ మార్కెట్ లో 69.85 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ, ఆపై కాసేపటికే ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. 2013, సెప్టెంబర్ 3 తరువాత నిన్న రూపాయి విలువ తొలిసారిగా ఒక్కరోజులో 110 పైసల పతనాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. రూపాయి విలువ మరింతగా పడిపోవచ్చని, డాలర్ తో మారకం సమీప భవిష్యత్తులోనే రూ. 71ని దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
Rupee
Dollar
Forex Market
All Time Low

More Telugu News